Monday 27 August 2012

మిక్స్డ్ ఫ్రూట్ జాం




కావాల్సిన  పదార్ధాలు  :

పండిన బొప్పాయి ముక్కలు - 1 కప్పు
ఆపిల్ ముక్కలు,అరటి పండు ముక్కలు ద్రాక్ష అన్నీ కలిపి - 1 కప్పు
పంచదార - 1 కప్పు
మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ - 1 స్పూను
నిమ్ముప్పు - 1/2 స్పూను


తయారు చేసే  విధానం:

ముందుగా పండ్ల ముక్కలు అన్ని కలిపి మిక్సి లో  పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు బాండి తీసుకోని స్టవ్వు మీద పెట్టి వేడెక్కాక పండ్ల పేస్టును వేసి అందులో పంచదార కూడా వేసి కలుపుతూ ఉండాలి. అది చిక్కగా జాంలా వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా నిమ్ముప్పు,మిక్స్డ్  ఫ్రూట్ ఎసెన్స్ వేసి ఒక నిమిషం తరువాత దించండి. అంతే  మిక్స్డ్ ఫ్రూట్ జాం రెడీ.


గమనిక : పండ్ల ముక్కలు తడి లేకుండా తుడిచి తరగండి. నెల రోజులు నిలువ ఉంటుంది

Tuesday 1 May 2012

ఓట్స్ ఉప్మా


కావాల్సిన  పదార్ధాలు  :

ఓట్స్- 1 కప్పు
నీళ్ళు-1 3/4 కప్పులు
పల్లీలు- 2 స్పూన్లు
మినపప్పు- 1 స్పూను
ఆవాలు -1 స్పూను
జీలకర్ర- 1 స్పూను
జీడిపప్పు పది
కరివేపాకు-1 రెమ్మ
ఉల్లిపాయ-1
మిరపకాయలు-2
క్యారెట్ ఒకటి
ఉప్పు తగినంత
నూనె తగినంత
నిమ్మకాయ-1

తయారు చేసే  విధానం:

ముందుగా ఓట్స్ వేయించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె/బాండి  స్టవ్వు మీద పెట్టి నూనె వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు,క్యారెట్ ముక్కలు, కరివేపాకు పచ్చి మిరప ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక ఇప్పుడు నీళ్ళు పొయండి. అందులో తగినంత ఉప్పు వేయండి. నీళ్ళు తెర్లేప్పుడు వేయించిన ఓట్స్ వేసి అది ఉడికే దాకా కలపండి. తరువాత స్టవ్వు ఆపేసి ఒక 2 నిముషాల తరువాత  నిమ్మకాయ రసం పిండండి




Monday 30 April 2012

క్యారెట్ రైస్


కావాల్సిన  పదార్ధాలు :

బియ్యం - 1 కప్పు
నీళ్ళు - 2 కప్పులు
క్యారెట్ - 3
నెయ్యి - 1/4 కప్పు
ఉప్పు తగినంత
మిరపకాయలు-3
పుదీన ఒక కట్ట


మసాలాకి కావాల్సినవి :

వెల్లుల్లి - 2 రెబ్బలు
అల్లం చిన్న ముక్క
లవంగాలు - 3
దాల్చిన చెక్క చిన్న ముక్క
యాలకులు - 2


తయారు చేసే విధానం :

ముందుగా క్యారెట్ తురుము పట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో నెయ్యి వేసి అది కాగాక అందులో క్యారెట్ తురుము, మిరపకాయ ముక్కలు,పుదీన ఆకులు వేసి వేయించండి. కొంచెం వేగాక స్టవ్వు ఆపి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు పైన ఇచ్చిన మసాలా దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోండి. ఒక గిన్నెలో కడిగిన బియ్యం, నీళ్ళు, వేయించిన క్యారెట్ తురుము, మసాల పేస్టు, తగినంత ఉప్పు వేసి అది ఉడికే దాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.    




స్వీట్ కార్న్ చపాతి

కావాల్సిన  పదార్ధాలు :

గోధుమ పిండి - 1 కప్పు
స్వీట్ కార్న్ గింజలు - 1/2 కప్పు
నీళ్ళు తగినన్ని
పచ్చి మిరపకాయలు- 3
జీలకర్ర-  1 స్పూను
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
నూనె తగినంత

తయారు చేసే విధానం :

ముందుగా మొక్కజొన్న గింజలు, మిరపకాయలు,జీలకర్ర కలిపి గ్రయిండ్ చేసుకోవాలి. ఇందులో గోధుమపిండి, ఉప్పు, పసుపు  వేసి బాగా కలపండి. అవసరమైతే తగినన్ని నీళ్ళు పోసి చపాతి పిండిలా కలపండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలు వత్తండి.  ఇప్పుడు స్టవ్వు మీద పెనం పెట్టి అది వేడెక్కాక చపాతీలు కాల్చండి.

బిర్యాని

కావాల్సిన  పదార్ధాలు :

బియ్యం- 1 కప్పు
నీళ్ళు- 2 కప్పులు
క్యారెట్ - 1
బంగాళాదుంప - 1
పచ్చి బఠాని - 1/4 కప్పు
క్యాలి ఫ్లవర్ ముక్కలు - 1/4 కప్పు
ఉల్లిపాయ  - 1
మిరపకాయలు - 2
పుదీన ఆకులు తగినన్ని
జీడి పప్పు పది
ఉప్పు తగినంత
నెయ్యి - 1/4 కప్పు

మసాలాకి కావాల్సినవి :

వెల్లుల్లి - 2 రెబ్బలు
అల్లం చిన్న ముక్క
లవంగాలు - 3
దాల్చిన చెక్క చిన్న ముక్క
యాలకులు - 2
గసగసాలు- 1 స్పూను
ఎండు కొబ్బరి - చిన్న ముక్క



తయారు చేసే విధానం :

ముందుగా గసగసాలు  వేయించుకోవాలి. తరువాత మసాలా దినుసులన్నీ కలిపి మెత్తగా గ్రయిండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్వు వెలిగించి గిన్నె పెట్టండి. నెయ్యి వేసి అది కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పుదీన , పచ్చి మిరపకాయలు,పచ్చి బఠాని  వేసి అవి వేగాక అందులో కూరగాయముక్కలన్నీ వేయండి.అవి కొంచెం వేగాక ఇప్పుడు మసాల పేస్టు  వేసి కలపండి. ఇప్పుడు నీళ్ళు పోసి అందులో సరిపడ ఉప్పు వెయండి. నీళ్ళు తెర్లేప్పుడు కడిగిన బియ్యం లో నీళ్ళనీ వంపేసి బియ్యం వేయండి. కొంచెం ఉడికాక మూత పెట్టి పూర్తిగా ఉడికాక దింపేయండి. అంతే వేడి వేడి బిర్యాని  రెడీ.

బీట్ రూట్ వడలు


కావాల్సిన పదార్ధాలు :

బీట్ రూట్ -1
మిరపకాయలు- 3
ఉల్లిపాయలు-1
ఉప్పు తగినంత
బియ్యపిండి - 1 కప్పు
నీళ్ళు తగినన్ని
నూనె తగినంత

తయారు చేసే విధానం :

ముందుగా బీట్ రూట్ తురుము పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు,ఉప్పు తగినన్ని నీళ్ళు వేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి.ఇప్పుడు బాండి లో నూనె పోసి స్టవ్వు మీద పెట్టాలి. నూనె కాగాక పిండిని చిన్న చిన్న వడలుగా  వేసి అవి ఎర్రగా వేగాక దించండి. అంతే వేడి  వేడి  బీట్ రూట్ వడలు  రడీ.

Sunday 29 April 2012

కార్న్(మొక్కజొన్న) దోశలు


కావల్సిన పదార్ధాలు :

మొక్కజొన్న గింజలు- 1కప్పు
మిరపకాయలు- 3
ఉల్లిపాయలు-1
ఉప్పు తగినంత
బియ్యపిండి - 1/4 కప్పు
నీళ్ళు తగినన్ని
నూనె తగినంత

తయారు చేసే విధానం :

ముందుగా మొక్కజొన్న గింజలు, మిరపకాయలు కలిపి గ్రయిండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బియ్యపిండి,తగినన్ని నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్వు మీద దోశల పెనం పెట్టి అది వేడెక్కాక దోశలుగా వేయాలి.

రాగి దోశలు

కావాల్సిన  పదార్ధాలు  :

రాగి పిండి -1 కప్పు
జొన్న పిండి-1 కప్పు
గోధుమ పిండి-1 కప్పు
ఉప్పు తగినంత
నీళ్ళు తగినన్ని
ఉల్లిపాయలు- 2
క్యారెట్- 1
నూనె తగినంత

తయారు చేసే  విధానం:

ముందుగా పైన చెప్పిన పిండ్లన్నీ ఒక గిన్నెలో వేసి తగినంత నీళ్ళు,ఉప్పు వేసి దోశల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి బాగా కలపండి. పిండి ఒక గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్వు మీద దోశల పెనం పెట్టి అది వేడెక్కాక దోశలుగా వేయాలి.




రాగి ఇడ్లీలు

కావాల్సిన  పదార్ధాలు  :

మినపప్పు - 1 కప్పు
రాగి పిండి -2 కప్పులు
ఉప్పు తగినంత
క్యారెట్-1
నీళ్ళు తగినన్ని


తయారు చేసే  విధానం:

ముందుగా మినపప్పు ఒక 4 గంటలు నానపెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వంపేసి మినపప్పు గ్రయిండ్ చేసుకోవాలి. ఇందులో  రాగి పిండి వేసి, ఉప్పు వేసి బాగా కలపండి. ఇడ్లీలు  చేసే ముందు క్యారెట్ తురుము వేసి కలపండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లల్లో కాస్త నెయ్యి రాసి పిండి వేసి ఇడ్లీలు తయారు చేయండి. ఇవి పల్లీ చట్నీ తో  తింటే బాగుంటాయి.


వేరుశనగ/పల్లీల పచ్చడి 1


కావాల్సిన పదార్ధాలు :

పల్లీలు- 1 కప్పు
ఎండు మిరపకాయలు-5
ఉల్లిపాయలు-1
ఉప్పు తగినంత
బెల్లం చిన్న ముక్క
చింతపండు తగినంత
నూనె తగినంత


తయారు చేసే విధానం :

ముందుగా పల్లీలు వేయించి పొట్టు తీసి  పెట్టుకోండి.
ఇప్పుడు బాండిలో కొంచెం నూనె పోసి అందులొ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. తరువాత ఎండు మిరపకాయ ముక్కలు వేయించండి. ఇవి చల్లారాక పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు ,ఎండు మిరపకాయ ముక్కలు,ఉప్పు,చింతపండు,బెల్లం అన్నీ కలిపి గ్రయిండ్ చేయండి. ఇది అన్నంతో తింటే బాగుంటుండి .

సగ్గుబియ్యం వడలు

కావాల్సిన పదార్ధాలు :

 
సగ్గుబియ్యం- ఒక కప్పు
పచ్చి మిరపకాయలు-3
ఉల్లిపాయలు-1
కొత్తిమీర
ఉప్పు తగినంత
బియ్యపిండి తగినంత
నూనె తగినంత
పుల్లటి పెరుగు పావు కప్పు


తయారు చేసే విధానం :


సగ్గుబియ్యం ముందుగా ఒక 4 గంటల ముందు నానపెట్టుకొవాలి .
ఇప్పుడు సగ్గుబియ్యం లో నీళ్ళు వంపేసి అందులో పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిరప ముక్కల పేస్టు, కొత్తిమీర బియ్యపిండి కలుపుకోవాలి. ఇప్పుడు బాండి లో నూనె పోసి స్టవ్వు మీద పెట్టాలి. నూనె కాగాక పిండిని చిన్న చిన్న వడలుగా  వేసి అవి ఎర్రగా వేగాక దించండి. అంతే వేడి  వేడి   సగ్గుబియ్యం వడలు  రడీ 



మొక్కజొన్న వడలు



కావాల్సిన పదార్ధాలు :

మొక్కజొన్న గింజలు- 1 కప్పు
పచ్చి మిరపకాయలు - 3
ఉల్లిపాయ-1
కొత్తిమీర
ఉప్పు తగినంత
నూనె తగినంత

తయారు చేసే విధానం :

మొక్కజొన్న గింజలు, పచ్చి మిరపకాయలు కలిపి మెత్తగా గ్రయిండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో ఉప్పు,కొత్తిమీర,ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. స్టవ్వు మిద బాండి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె కాగాక పిండిని చిన్న చిన్న వడలు గ వేసి అవి ఎర్రగా వేగాక దించండి.
గమనిక : పిండి పల్చగా అయితే అందులో కొంచెం కార్న్ ఫ్లోర్  కలపండి.

Tuesday 27 March 2012

సగ్గుబియ్యం ఉప్మా

కావాల్సిన  పదార్ధాలు  :  

సగ్గుబియ్యం- 1 కప్పు
పల్లీలు-1/4 కప్పు
మినపప్పు- 1 స్పూను
ఆవాలు -1 స్పూను
జీలకర్ర- 1 స్పూను
జీడిపప్పు పది
కరివేపాకు-1 రెమ్మ
కొత్తిమీర
ఉల్లిపాయ-1
మిరపకాయలు-2
క్యారెట్ ఒకటి
ఉప్పు తగినంత
నూనె తగినంత
పసుపు చిటికెడు


తయారు చేసే  విధానం:


ముందుగా పల్లీలు వేయించి పొట్టు తీసి పొడి చేసి పెట్టుకోండి
సగ్గుబియ్యం ముందుగా ఒక 4 గంటల ముందు నానపెట్టుకొవాలి .
ఇప్పుడు ఒక గిన్నె/బాండి  స్టవ్వు మీద పెట్టి నూనె వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు,క్యారెట్ ముక్కలు, కరివేపాకు పచ్చి మిరప ముక్కలు,ఉప్పు,పసుపు వేసి వేయించాలి. అవి వేగాక ఇప్పుడు నానపెట్టిన సగ్గుబియ్యం లో నీళ్ళు వంపేసి బాండి లొ వేసి బాగా కలపండి. మూత పెట్టి మధ్య మధ్య లో కలుపుతూ ఉండండి. చివరగా పల్లీల పొడి చల్లి బాగ కలిపి కొత్తిమీర చల్లండి.