Tuesday 16 April 2013

క్యాప్సికం మసాల కూర


కావలసిన పదార్ధాలు :

క్యాప్సికం - 3
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 స్పూను
కారం - తగినంత
ఉప్ప్పు - తగినంత
కొబ్బరి పొడి - 2 స్పూను
నువ్వుల పొడి - 2 స్పూను
జీలకర్ర పొడి - 1  స్పూను
మెంతి పొడి - 1/2 tsp
చింతపండు పులుసు - 1/4 cup
అల్లం వెల్లుల్లి ముద్ద -1  స్పూను
కరివేపాకు -రెండు రెబ్బలు
నూనె -  తగినంత


తయారు చేసే విధానం :


క్యాప్సికం ముక్కలుగ కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. అల్లం వెల్లులి ముద్ద, కరివేపాకు. పసుపు వేసి కొద్దిగా వేయించి క్యాప్సికం ముక్కలు,కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి నిదానంగా మగ్గనివ్వాలి. క్యాప్సికం ముక్కలు మెత్తబడ్డాక చింతపండు పులుసు , కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, మెంతి  పొడులు వేసి కలిపి కప్పు నీళ్లుపోసి నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి. 

No comments:

Post a Comment